TRINETHRAM NEWS

Trinethram News : రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు..

డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి..

డీఆర్‌జీ పెట్రోలింగ్‌ బృందం చిన్న తుంగలీ అడవీ ప్రాంతంలో గాలిస్తుండగా.. మావోయిస్టులు తారసపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు..