TRINETHRAM NEWS

హైదరాబాద్‌ నగరంలో మెట్రోరైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్‌లైన్లో సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

15 రోజుల్లో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల్లో విజిలెన్స్‌ సోదాలు జరుగుతాయని, ఇష్టానుసారం వ్యవహరించిన అధికారులందరూ ఇంటికి వెళ్లాల్సిందేనని చెప్పారు.

హెచ్‌ఎండీఏ కార్యాలయంలో వాటర్‌వర్క్స్‌, పురపాలక, జీహెచ్‌ఎంసీపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు..