TS High Court: మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటన.. వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో (TS High Court) విచారణ వాయిదా పడింది. సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు..
మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై (Medigadda Incident) పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మహాదేవపురం పీఎస్‌లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు..
పిల్లర్ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర సీఎస్‌కు డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి నుంచి సమాచారం తీసుకుని వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని (TS Govt) హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను హైకోర్టు ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది..