TRINETHRAM NEWS

విశాఖ వేదికగా ఇవాళ ‘మిలాన్-2024’ విన్యాసాలు ప్రారంభమయ్యాయి.

తొలుత 50 దేశాల జాతీయ జెండాలతో నేవీ సిబ్బంది ర్యాలీ చేశారు.

తర్వాత హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఈ నెల 28 వరకు కొనసాగే ఈ వేడుకల్లో 20కి పైగా యుద్ధ నౌకలు, విమానాలు పలు ప్రదర్శనలు చేయనున్నాయి.

మిత్ర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి రెండేళ్లకోసారి ఇండియన్ నేవీ మిలాన్ను నిర్వహిస్తోంది.