TRINETHRAM NEWS

భాగల్పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో “బాంకా” జిల్లాలో మందార పర్వతం ఉంది. మందార పర్వతంలో “శంఖగుండం” ఉంది. ఈ శంఖ గుండం సంవత్సరంలో 364 రోజులు దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది. మహాశివరాత్రి గడియలలో ఈ గుండంలో నీరు మొత్తం మాయమౌతుంది, గుండం అడుగున ఉన్న “పాంచజన్య శంఖం” భక్తులకు దర్శనమిస్తుంది. మహాశివరాత్రి గడియలు పూర్తికాగానే శంఖ గుండం తిరిగి నీటితో నిండిపోతుంది.పరమశివుడు పాలసముద్రమథనం జరిగినప్పుడు వచ్చిన హాలాహలాన్ని ఈశంఖంలో నింపి సేవించి  నీలకంఠుడు అయ్యాడని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది.

మహాశివరాత్రి ఘడియలలో నీరు ఎక్కడకు వెల్తుంది, గడియలు ముగిసిన క్షణమే నీరు ఎలా వస్తుంది అనేది నేటికీ అంతుపట్టని రహస్యం.