TRINETHRAM NEWS

ప్రపంచ బుక్ అఫ్ రికార్డ్స్ లో గొట్టిముక్కుల నాసరయ్య

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక సాహితీవేత్త, తెలుగు అధ్యాపకులు గొట్టిముక్కుల నాసరయ్య డిసెంబర్ 16. 17 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బుద్దాల కాన్వెన్సన్ హాల్ లో అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు, శ్రీశ్రీ కళావేదిక నిరంతర సాహితీ మరియు కళా ప్రభంజనంలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో ప్రపంచ కవితోత్సవంలో పాల్గొని కవితాగానం చేసిన గొట్టిముక్కుల నాసరయ్య మన మాతృభాష, సాహిత్యం, కళా, సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధికి సాహిత్యం ద్వారా నాసరయ్య చేస్తున్న కృషిని అభినందిస్తూ, తెలుగు సాహితీ కళా చరిత్రలో 30 గంటల 30 నిముషాల 30 సెకన్లు పాటు నిర్విరామంగా నిర్వహించిన రికార్డ్స్ గా గుర్తించి అమేజింగ్ వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్, భారత్ టాలెంట్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ అఫ్ రికార్డ్స్, తానా (తెలుగు అసోసియేషన్ అఫ్ నేషనల్ అకాడమీ ) మరియు కల్చరల్ టాలెంట్స్ బుక్ అఫ్ రికార్డ్స్ గొట్టిముక్కుల నాసరయ్య పేరు నమోదు చేస్తున్నట్లుగా దృవీకరిస్తూ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందించామని, శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్, జాతీయ సమన్వయ కర్త కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరి భూషణం మరియు జాతీయ కార్యవర్గ కమిటీ, రాష్ట్ర కార్యవర్గ కమిటీ తదితరులు తెలిపారు, ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ తనను సాహితీ రంగంలో ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకువచ్చిన శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ కు కృతజ్ఞతలు తెలిపారు, అనంతరం నాసరయ్యను తమ గురువులు ఉడుముల శ్రీనివాస రెడ్డి, జానకి దేవి, యునా సార్, సుబ్బారావు తెలుగు ఉపాధ్యాయులు రిటైర్డ్ సార్, సెవెన్ హిల్స్ బి ఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్. నాగేశ్వరమ్మ, శివరామకృష్ణ, షరీప్, శ్రీ కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట, డైరెక్టర్ కొల్లి బ్రహ్మయ్య, ప్రిన్సిపాల్ ఎన్. వెంకట రాజ్యలక్ష్మీ దేవి , వెంకటేశ్వరరెడ్డి, శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజీ, పొదిలి, డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి సార్ మరియు ఆల్ఫా కాలేజీ అఫ్ ఎడ్యుకేషన్, కనిగిరి ప్రిన్సిపాల్ రసూల్ సార్ మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల కవులు, కళాకారులు, బంధు మిత్రులు అభినందించారు.