హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
‘‘భారాస కుటుంబం ఉద్యోగాలు ఊడగొట్టినందుకే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించి భారాసను గద్దె దించారు. 3650 రోజులు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదు. దోచుకున్నది.. దాచుకోవడంపైనే దృష్టిపెట్టారు. మేడిగడ్డ పేక మేడలా కూలిపోయే పరిస్థితి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.81లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు. కాగ్ నివేదికను సభలో పెట్టాం. ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. అధికారమిస్తే చేసి చూపిస్తానంటున్నారు హరీశ్‌రావు. పదవి రావాలంటే ఆయన మరో ఔరంగ జేబు అవాతరం ఎత్తాల్సిందే.
త్వరలో గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తాం. ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నాం. అధికారం చేపట్టిన 70 రోజుల్లోనే దాదాపు 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గత ప్రభుత్వం విద్యపై ఖర్చు చేసింది కేవలం 6శాతం మాత్రమే. దాన్ని 10 నుంచి 12శాతానికి పెంచి గురుకుల పాఠశాలలను బలోపేతం చేస్తాం’’ అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు….
70 రోజుల్లోనే 25వేల నియామకాలు చేపట్టాం CM Revanth Reddy
Related Posts
జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్
TRINETHRAM NEWS జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై…
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి
TRINETHRAM NEWS బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ…