Trinethram News : సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్.
షాపూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతితులుగా సీపీఐ కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ అధ్యక్ష,కార్యదర్శి స్వామి, శ్రీనివాస్ లు పాల్గొని గుర్తింపు కార్డులను ఇచ్చి కార్మికులను ఉదేశించి మాట్లాడటం జరిగింది.
భవనం కట్టే సమయంలో ప్రతి భవన యజమాని కట్టే 2 శాతం పన్ను భవన నిర్మాణ కార్మికులకు చెందాలని కమ్యూనిస్టులు పోరాడితే సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తున్నాయి కానీ అందరూ గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారా లేదా అని తెలుసుకోకపోవడం వల్ల కార్మికులు గుర్తింపు కార్డులను పొందట్లేదని అందరికి గుర్తింపు కార్డులు పొందాలని దాని కొరకు సీపీఐ, ఏఐటీయూసీ సహకరిస్తుందని అన్నారు. గుర్తింపు కార్డు వల్ల కార్మికులు ప్రమాద భీమా,పెండ్లిలకు ఆర్థిక సహాయం ,కాన్పులకు సహాయం, అంగవైకల్యం కు, వృద్ధులకు పెన్షన్ వంటివి పొందవచ్చు అని కావున అందరు గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని కార్మికులను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి రాము, భవన నిర్మాణ కార్మికుల నాయకులు ప్రభాకర్, కనకయ్య, చంద్రమౌళి,వెంకన్న, ప్రమీల,చంద్రమ్మ,బాలమని,మల్లన్న తదితరులు పాల్గొన్నారు.