అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి – జీతాలు పెంచాలి
సిఐటియు
ఇబ్రహీంపట్నం
అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరవధిక సమ్మె 7 వ రోజుకు చేరిన సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమాని ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి యం మహేష్ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని వేతనం లో సగం పెన్షన్ గా ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్స్ గా మార్చాలని, పెండింగ్ సెంటర్ అద్దెలు విడుదల చేయాలని, గ్యాస్ సిలిండర్ల ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని నాణ్యమైన సరుకులను అందించాలని డిమాండ్ చేస్తూ జరిగే నిరవధిక అంగన్వాడీ సమ్మె ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు
అంగన్వాడీ సమ్మె కు టిడిపి సంపూర్ణ మద్దతు
సమ్మె కు మద్దతు ప్రకటించిన టిడిపి మండల అధ్యక్షుడు రామినేని రాజా మరియు కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు చుట్టూకుదురు శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ రాష్ట్ర వైసిపి ప్రభుత్వం పరిష్కరించాలని, మేము అధికారం లోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఇబ్రహీంపట్నం సెక్టార్ లీడర్స్ బుల్లిమ కుమారి సామ్రాజ్యం విజయలక్ష్మి ఇలప్రోలు సెక్టార్ లీడర్స్ నిర్మల శాంతి శ్రీ సావిత్రి పద్మ కేతనకొండ సెక్టార్ లీడర్స్ రబ్బానీ అలివేలు నిర్మల తదితరులు పాల్గొన్నారు