Trinethram News : రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది..
రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి..
పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు..