TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి..

రెబల్‌ ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగతోంది.. ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు..

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారించనున్నారు.. ఈ రోజు ఉదయం పూట ముగ్గురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. అయితే, అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది..

అయితే, ఈనెల 9వ తేదీన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు స్పీకర్.. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబెల్స్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.. ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తూ.. 9వ తేదీన నోటీసులు జారీ చేశారు స్పీకర్‌.. ఆ నోటీసుల ప్రకారం.. ఈ నెల 12వ తేదీన అంటే ఈ రోజు వారి అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు స్పీకర్‌..