హ్యాపీ ఫీట్ స్కూల్ ను ప్రారంభించిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

TRINETHRAM NEWS

ఈరోజు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్ సురేష్ రెడ్డి ముఖ్య అతిధులుగా బాచుపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ ఫీట్ స్కూల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు, స్కూల్ వాతావరణానికి అలవాటు పడేందుకు అనుగుణంగా ఉండి, అదే విధంగా పిల్లలకు మానసికంగా తమ ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా హ్యాపీ ఫీట్ ప్రీ స్కూల్ ఏర్పాటు చేసిన డైరెక్టర్ కే. పద్మావతి,ప్రిన్సిపల్ సౌజన్య, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు, మరియు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సాయి ముదిరాజ్, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, అజయ్ వర్మ, కౌసల్య కాలనీ ప్రెసిడెంట్ శివ ప్రసాద్, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top