సెప్టెంబర్ 7, 2026

WhatsApp Image 2024 02 09 at 10.31.27

TRINETHRAM NEWS

Trinethram News : రాయ్‌పూర్ : ఫిబ్రవరి 09
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా- దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది.

భద్రతా బలగాలు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావో యిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు.

సుక్మా-దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గురువారం రాష్ట్ర పోలీసులు, సిఆర్‌పిఎఫ్ బృందాలు మావోయిస్టులు ఉన్నారని సమాచారం రావడంతో జల్లెడ పడుతుండగా మావోలు తారసపడ్డారు.

పోలీసులు కనిపించగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. చంద్రన్నపై రూ.8 లక్షల రివార్డు ఉంది.

ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రితో పాటు ఎకె47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

You cannot copy content of this page