TRINETHRAM NEWS

డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘం అవతరించిన అనతికాలంలోనే మా సంఘం ప్రతిపాదించిన ముఖ్యమైన డిమాండ్లలో ఉచిత విద్య, వైద్యం పై క్లారిటీ ఇచ్చిన ప్రో.కోదండరాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

సమాజశ్రేయస్సు కోసం అనునిత్యం పాటుపడే జర్నలిస్టులు విద్య, వైద్యం లాంటి కనీస అవసరాలు అందక అనేక అవస్థలు పడుతున్నారని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రో.కోదండరాం అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన ఆయన జర్నలిస్టుల పై ప్రభుత్వాలు సానుకూలంగా ప్రవర్తించాలని సూచించారు. జర్నలిస్టులందరికీ వైద్యంతో పాటు నివేశన స్థలాల కేటాయింపులు జరగాల్సి ఉందన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థలలో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీతో కూడిన విద్యకు ఆమోదం ఉన్నప్పటికీ అమలుకావటం లేదన్న విషయాలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు.

అంతేకాక జర్నలిస్టులకు అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందేలా కృషి చేయాలని, ఈ మేరకు తగిన ప్రతిపాదనను తన వద్దకు తీసుకువస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో సానుకూలంగా ఉందని, త్వరితగతిన జర్నలిస్టులకు మంచి జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

చట్టసభలలో సైతం పోరాడి జర్నలిస్టులకు త్వరలోనే తీపికబురు అందిస్తారని ఆశిస్తున్నాము.