నవంబర్ 5, 2026
TRINETHRAM NEWS
BRS Review Meeting

–పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.

— గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల భాగస్వామ్యం పెరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

–దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

BRS Review Meeting : దేవరకొండ డివిజన్ నవంబర్ 05, త్రినేత్రం న్యూస్. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం పురోగతిని నాయకులతో సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలు, పట్టణాల్లోని అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల భాగస్వామ్యం పెరిగేలా ప్రతి నాయకుడు, కార్యకర్త తమ బాధ్యతను గుర్తించి చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. అర్హులైన ఒక్క పట్టభద్రుడు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోకుండా మిగిలిపోకూడదని పేర్కొన్నారు.
అలాగే గతంలో కరోనా మహమ్మారి సమయంలోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు తాగునీరు, విద్యుత్‌తో పాటు అవసరమైన అన్ని సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుందని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ఘనత కేసీఆర్ దని రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page