
Nutrition Month : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 26, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని బొగ్గుల దోన మరియు జేత్య తండా గ్రామంలలో పోషణ మాసంకార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిండి సెక్టార్ సూపర్ వైజర్ ఎం ,రేణుక ఈసందర్భంగా మాట్లాడుతూ….
కిశోర బాలికలు ఐరన్ లోపము రాకుండా రాగిజావ , బెల్లం , పల్లీలు ఆకు కూరలు, సీజన్స్ పండ్లు తినడం , డ్రాప్ అవుట్ కాకుండా విద్య ను అభ్యసించాలి అని, ప్రతి తల్లి కి శిశు సంరక్షణ పద్ధతులు, నవజాత శిశు సంరక్షణ, తల్లిదండ్రులు శిశువు పరస్పర సంబందాలపైన అవగాహన కల్పించడానికి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నిరంతరం కృషి చేస్తున్నామనీ మరియు శిశువు లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిషన్ , ఉప సర్పంచ్, వార్డు మెంబర్, అంగన్వాడి టిచర్ లు శ్రీదేవి, జ్యోతి కిశోర బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బాడీ మెటబాలిజం పెంచుతూ, తక్షణ శక్తినిచ్చే Herbalife Afresh Energy Drink Mix (Lemon – 50g) ఇప్పుడే ఆర్డర్ చేయండి!