TRINETHRAM NEWS

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 02 – 02 – 2024,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – హేమంత ఋతువు,
పుష్య మాసం – బహళ పక్షం,

తిథి : సప్తమి ఉ11.29 వరకు,
నక్షత్రం : స్వాతి రా1.49 వరకు,
యోగం : శూలం ఉ9.44 వరకు,
కరణం : బవ ఉ11.29 వరకు,
తదుపరి బాలువ ఙరా11.57వరకు,

వర్జ్యం : ఉ.శే.వ7.52 వరకు,
దుర్ముహూర్తము : ఉ8.50 – 9.35 &
మరల మ12.36 – 1.21,
అమృతకాలం : సా4.25 – 6.07,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo : మ3.00 – 4.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం: 5.51,

          నేటి మాట

భగవంతుని పొందాలంటే ఏమి చేయాలి???
మనం భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా, ఏదో బాహ్యంగా పైపైన చేస్తూఉంటాము…
బయటకు మాత్రం “ఓ భగవాన్! నేను నీ దాసుడను, నాకు నీవుతప్ప వేరే దిక్కులేదు”అంటూ ఉంటాము.
కాని మన ప్రవర్తన అందుకు విరుద్దంగా ఉంటుంది…
మన మనస్సు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది, నిజంగా మన మనస్సు, మాట ఒకటిగా ఉండదు.
ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం ?

మనం బయట ఏం మాట్లాడుతామో, మన మనస్సులోని ఆలోచనలు కూడా అదేవిదంగా ఉండాలి…
అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి.
“భగవంతుని నామం, ఆయన రూపం వేరుకాదు”
భగవన్నామస్మరణలో ఆనందం అధికమౌతుంది, ఆయన ప్రేమమయుడు, ఆనందమయుడు, ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాము…

సాధారణంగా మన మనస్సు నానా విషయాల పట్ల పరుగెడుతూ ఉంటుంది.
అలా పరిగెత్తే మనస్సును నియంత్రించి భగవంతుని పై కేంద్రకరించడానికి ప్రయిత్నించాలి, అదే అభ్యాసమంటే!!…

“సూదిబెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒక్కటిగా చేయాలి??”…
“దారపుపోగులు విడివిడిగా ఉంటే సూదిబెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం..”

అలాగే భగవంతుని యందు మనస్సును నిమగ్నం చేయాలంటే బాహ్యవిషయాల వైపు పరుగులు తీసే మనస్సును నియంత్రించి ఏకాగ్రం చేయాలి, ఇంద్రియనిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు…
“భగవంతుణ్ణి పొందాలంటే పరితపనయే పరమోత్తమ సాధన !”

           శుభమస్తు

సమస్త లోకా సుఖినోభవంతు