ఆగస్ట్ 22, 2026
TRINETHRAM NEWS
Inauguration VDN A/C

ఎమ్మెల్యే బాలు నాయక్ . — శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

Inauguration VDN A/C : కొండమల్లేపల్లి: ఆగష్టు 21, త్రినేత్రం న్యూస్ : కొండమల్లేపల్లి మండలం, చిన్నఅడిశర్లపల్లి స్టేజీ వద్ద దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ నూతనంగా ఏర్పాటు చేసిన VDN A/C కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత లతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్* ముఖ్య అతిథిగా హాజరై కన్వెన్షన్ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వడ్త్య దేవేందర్ నాయక్ కి ఎమ్మెల్యే బాలు నాయక్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కన్వెన్షన్ హాల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నూతన వేదిక ప్రజలకు వివాహాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, దేవరకొండ మునిసిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page