24 గంటల్లో కొత్తగా 614 కరోనా కేసులు నమోదు
కొవిడ్‌తో ముగ్గురు మృతి
దిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రోజువారీ కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఈ ఏడాది మే 21 తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,311 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జేఎన్-1 అనేది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని ప్రకటించింది. దీన్ని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించింది.