గోదావరిఖని, ఆగస్టు -01: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని పట్టణంలోని రమేష్ నగర్ లో అక్రమంగా నిల్వ చేసిన 4.27 క్వింటాళ్ల రేషన్ బియ్యం , వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 13 గృహ సిలిండర్లను పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు.
గురువారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ గోదావరిఖని పట్టణంలో రమేష్ నగర్ లో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ముందస్తు సమాచారంతో రమేష్ నగర్ లోని టి.సత్యం అనే వ్యక్తి వద్ద తనిఖీలు నిర్వహించి 4.27 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని , వాణిజ్య అవసరాలకు వాడుతున్న 2 గ్యాస్ సిలిండర్లను, అదే సమయంలో రాజ వీరు అనే వ్యక్తి వద్ద 11 గ్యాస్ సిలిండర్లు పట్టుకోవడం జరిగిందని అన్నారు.
దోషులపై ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వులు 2016 ప్రకారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ తనిఖీలలో వన్ టౌన్ ఎస్ఐ సంతోష్ సింగ్ డిటి రవీందర్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు.