Trinethram News : గుంటూరు
అనునిత్యం ఇతర రాష్ట్రాల నుండి రైళ్లు రాక, పోకలు కు సౌత్ సెంట్రల్ రైల్వే నిలయాలలోలో ఏపీ లో ప్రసిద్ది గాంచిన గుంటూరు రైల్వే స్టేషన్లో ఈరోజు(సోమవారం) ఉదయం 4: 30 గంటలకు రాయగడ నుంచి గుంటూరు కు చేరుకున్న రైలు లో గంజాయి లభ్యమైంది.
కాంట్రాక్ట్ సూపర్ వైజర్ రైలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక బ్యాగ్ కనపడడంతో వెంటనే అది తీసి చూడగా అందులో 20 కేజీల గంజాయి ఉంది.
వేంటనే అయన జి అర్ పి పోలీసులకు అప్పగించారు.
నిందితుల వివరాలు తెలియరాలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు.