ప్రాథమిక వైద్య కేంద్రం అంతార్గం లో 108 వాహనాన్ని ప్రారంభించిన
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
అంతర్గం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎమ్మెల్యే సూచన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యం గురించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టండి
అంతర్గం మండల పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని 108 వాహనాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ
రామగుండం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించదానికి ప్రభుత్వ పథకాలు కాకుండా రామగుండం అభివృద్ధి కోసం బట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధర్ బాబు చొరవతో ప్రత్యేక నిధులు తీసుకొని రావడం జరుగుతుంది .
ఈ సందర్భంగా బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు
ఇంటి ఇంటికి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల క్షేమము కోసం వైద్యులు, మరియు ఆశ వర్కర్లు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా, మీ మీ గ్రామాల్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ లలో ఉన్నటువంటి విద్యార్థుల ఆరోగ్యం గురించి మీరు కార్యక్రమాలు చేపట్టాలని వారికి సూచనలు చేసిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి, మండల వైద్య అధికారులు , సిబ్బంది ,మండల అధ్యక్షుడు హనుమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App