తిరుపతి జిల్లా… నాయుడుపేట
మోటార్ సైకిళ్లు దొంగలు ముగ్గురు అరెస్ట్.
సుమారు రూ.7,95,000/- విలువ గల 09 మోటారు సైకిళ్లు స్వాధీనం.
జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్ల పరిధిలో దొంగతనం చేయబడిన 9 మోటార్ సైకిళ్ళు ను రికవరీ చేసిన నాయుడుపేట పోలీసులు.
ముద్దాయిలందరూ నాయుడుపేట పట్టణ వాసులే.
జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., ఆదేశాల మేరకు కేసు వివరాలను వెల్లడించిన నాయుడుపేట డిఎస్పి రాజగోపాల్ రెడ్డి.
గురువారం నాడు జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., ఆదేశాల మేరకు నాయుడుపేట పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నాయుడుపేట డిఎస్పి రాజగోపాల్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.
అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు:-
- ఆర్కాట్ రాజేష్ s/o సురేంద్ర, వయస్సు 19 సంవత్సరాలు, గిరిజన కాలనీ, LA సాగరం నాయుడుపేట టౌన్.
ప్రస్తుతం: అమరా గార్డెన్, నాయుడుపేట టౌన్. - చిత్తూరు ముని శంకర్ s/o ఆనంద్, వయసు 20 సంవత్సరాలు, గరిడి వీధి.
ప్రస్తుతం అమరా గార్డెన్, నాయుడుపేట టౌన్. - పెనుబాకు బాలకృష్ణ s/o రమణయ్య, వయస్సు 25 సంవత్సరాలు, చేరెడ్డిపల్లి వెంకటగిరి టౌన్.
ఈ ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది.
జువైనల్
ఈ కేసులో సోగా దుర్గయ్య s/o అంకయ్య, వయస్సు 17 సంవత్సరాలు, లోతు వాణిగుంట.
ప్రస్తుతం అమరా గార్డెన్ నాయుడుపేట టౌన్, అనే ఒక జువెనైల్ కూడా ముద్దాయిగా ఉన్నారు. ఈ ముద్దాయిని జువెనైల్ హోమ్ కు తరలించడం జరిగింది.
స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాల వివరాలు:-
రాయల్ ఎన్ఫీల్డ్ – 2,
బజాజ్ పల్సర్ – 5,
హీరో HF డీలక్స్ – 1,
హోండా యాక్టివా – 1.
కేసు వివరాలు:-
ఇటీవల కాలంలో తరచుగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు పెరగడంతో ఆ ముద్దాయిలను వెంటనే అరెస్టు చేసి దొంగతనం చేయబడిన మోటార్ సైకిల్ ను రికవరీ చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులకు ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నారు.
అందులో భాగంగా తన (నాయుడుపేట డిఎస్పి రాజగోపాల్ రెడ్డి) స్వీయ పర్యవేక్షణలో నాయుడుపేట పోలీస్ స్టేషన్ ఇన్చార్జి సీఐ జగన్మోహన్ రావు, ఎస్సైలు మరియు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనుమానితుల కదిలికలపై నిఘా పెట్టి ఈ రోజు ఈ ముద్దాయిలను గుర్తించి, అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు రూ.7,95,000/-ల విలువ గల 9 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
పట్టుబడిన ముద్దాయిలు అందరూ నాయుడుపేట టౌన్ అమరా గార్డెన్ కు చెందిన వారు. వీరందరూ చదువును మధ్యలో ఆపేసి ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకుంటూ మద్యం ఇతర చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడిన ఈ నలుగురు ముద్దాయిలు(జువెనైల్ తో సహా) కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో రాత్రి సమయాలలో వివిధ ప్రదేశాలలో తిరుగుతూ మారుతాలాలతో గాని బల ప్రయోగం ద్వారా గాని మోటార్ సైకిల్ల తాళం తీసి దొంగతనాలు చేయుచు వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతుండేవారు అని నాయుడుపేట డిఎస్పి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
ఈ కేసుల చేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాయుడుపేట డిఎస్పి రాజగోపాల్ రెడ్డి, నాయుడుపేట పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సీఐ జగన్మోహన్ రావు, ఎస్సైలు రఘునాథ్, కృష్ణయ్య, పెళ్లకూరు ఎస్ఐ శ్రీకాంత్, నాయుడుపేట పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుళ్లు కరీం, మస్తాన్, పోలీస్ కానిస్టేబుళ్లు కుమార్ రాజా, ముని శేఖర్, దయాకర్, భాను తేజ వారిని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., అభినందించి రివార్డులను ప్రకటించారు.