TRINETHRAM NEWS

సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ..

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు..

  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం..

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్. కే గార్డెన్స్ లో శనివారం రోజున పెద్దపల్లి నియోజకవర్గనికి సంబంధించిన 368 మంది లబ్దిదారులకు (₹1,012,7500 /- )1 కోటి 12 లక్షల 7 వేల 500 /- రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ

తాను గెలిచిన సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు చేయడం ఆనందదాయకమైన అంశం అని ప్రజల దీవెనలతో గెలిచిన తాను ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నానని నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి తన సమయంలో ఎక్కడ జరగదని ఉదాహరణ ధాన్యం కటింగ్ లేకుండా కొనుగోలు చేయడం జరిగిందని ఇసుక మాఫియా మట్టి మాఫీయా లేకుండా తాను నిక్కచ్చిగా ప్రజలకు ఉచితంగా పంపిణీ సాగిస్తున్నానని మనకు ముఖ్యంగా జిల్లా కేంద్రానికి బస్ డిపో మంజూరు అవడం మన ప్రాంతానికి బస్సు సౌకర్యం అన్ని గ్రామాలకు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంవత్సరం కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన నియోజకవర్గానికి కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు మంజూరు చేశారని రానున్న కాలంలో గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలు సైతం తన వెంట ఉన్నంతకాలం తాను నిజాయితీగా పాలన సాగిస్తానని సందర్భంగా పేర్కొన్నారు. ఇంటి స్థలం ఉన్న ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అర్హులైన నిరు పేదలందరికీ రేషన్ కార్డు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, తహసీల్దార్ రాజ్ కుమార్,నూగిళ్ల మల్లయ్య,సయ్యద్ మస్త్రత్,మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, కడర్ల శ్రీనివాస్,సమా రాజేశ్వర్ రెడ్డి, సందనావేణి రాజేందర్, చిలుక సతీష్, భూతగడ్డ సంపత్, ధరవేనా నర్సింగ్ యాదవ్, కూర మల్లరెడ్డి కొమ్ము పోచలు,తులా మనోహర్ రావు పట్టణ కౌన్సిలర్లు మరియు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు, నసుయ్ నాయకులు మరియు సీ.ఎం.ఆర్.ఎఫ్ లబ్ధిదారులు మరియు మాజీ సర్పంచులు , ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App