TRINETHRAM NEWS

నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే పిల్లలకు అందించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*హాస్టల్స్ టైమింగ్స్ కట్టుదిట్టంగా అనుసరించాలి

*పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

*రెసిడెన్షియల్ హాస్టిల్స్ పై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, నవంబర్ -23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన ఆహారం మాత్రమే అందించాలని  జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రెసిడెన్షియల్ హాస్టిల్స్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ,  ప్రస్తుతం  రెసిడెన్షియల్ హాస్టల్స్ పై అందరి దృష్టి ఉందని, అక్కడ చిన్న సమస్య వచ్చినా పెద్దగా చూపించే ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మంథని లో జరిగిన ఫుడ్ పాయిజినింగ్ వంటి సంఘటనలు మరో సారి పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.

పిల్లలకు అందించే ఆహారం పట్ల పూర్తి జాగ్రత్తగా ఉండాలని అన్నారు.  ప్రతి పూట వేడి వేడి ఆహారం మాత్రమే అందించాలని, నిల్వ చేసిన ఆహారం అందించవద్దని అన్నారు. వాతావరణం మారుతున్న నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. 

నారాయణపేట జిల్లాలో జరిగిన  ఫుడ్ పాయిజన్ కేసుల వల్ల జిల్లా విద్యాశాఖ అధికారి కూడా సస్పెండ్ అయ్యారని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేయాలని కలెక్టర్ తెలిపారు స్థానికంగా ఉన్న అధికారులతో పిల్లల ఆరోగ్యం ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలని కలెక్టర్ సూచించారు.

ముత్తారం లో డంపింగ్ యార్డ్ చెత్త కాల బెట్టడం వల్ల పాఠశాల విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారని, ఇటువంటి పరిస్థితులు వేరే ఏదైనా పాఠశాల దగ్గర ఉన్నాయో గమనించి నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు హాస్టల్స్ టైమింగ్ కట్టుదిట్టంగా అనుసరించాలని కలెక్టర్ తెలిపారు.

హాస్టల్స్ లో ఏదైనా మరమ్మత్తులు చేయాల్సి ఉంటే ప్రతిపాదనలు అందించాలని అన్నారు. హాస్టల్స్ లో పిల్లలకు అందించే ఆహారం నాణ్యతను ఒకటికి రెండుసార్లు పరిశీలించి అందజేయాలని, ఎక్కడ కూడా నాణ్యత అంశంలో రాజీ పడవద్దని కలెక్టర్ తెలిపారు.

నాణ్యమైన ఆహార పదార్థాలు సరఫరా చేయని పక్షంలో వెంటనే వాటిని రిజెక్ట్ చేస్తూ సదరు కాంట్రాక్టర్ కు లేఖ రాయాలని కలెక్టర్ తెలిపారు హాస్టల్స్ కు సరఫరా చేసే గుడ్డు యొక్క సైజ్ , నాణ్యత పరిశీలించి తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో సంబంధిత బీసీ వెల్ఫేర్ అధికారి రంగా రెడ్డి,జిల్లాలోని అందరూ హాస్టల్ వార్డెన్స్,అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App